|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:30 PM
ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఆంధ్ర సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రుణాలు అందిస్తుందని కుప్పం నియోజకవర్గం, శాంతిపురం సప్తగిరి బ్యాంక్ మేనేజర్ సింహాద్రి శనివారం తెలిపారు. మండలంలోని ముల్లూరు కృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉయ్యాల జయరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సైకిళ్లపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రూ. 5 వేలు చెల్లించి సైకిల్ బుక్ చేసుకుంటే బ్యాంకు లోన్ ద్వారా సైకిళ్లను పొందవచ్చని జయరామిరెడ్డి పేర్కొన్నారు.
Latest News