|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:31 PM
ఉదయం నిద్ర లేవగానే ముఖంపై అదనపు నూనె కనిపిస్తే చల్లటి నీటితో కడుక్కోవడం వల్ల అది తొలగిపోయి ముఖం మెరుస్తుంది. ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే తక్షణమే గ్లో వస్తుంది, చర్మంపై జిడ్డు తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నిద్రలేచిన తర్వాత ముఖం ఉబ్బినట్లుగా ఉన్నా, మేకప్ ఎక్కువసేపు ఉండాలన్నా, చర్మానికి శాంతి, ఒత్తిడి తగ్గాలన్నా ఐస్ వాటర్ ఉపయోగపడుతుంది. మొటిమలు, వాటి వల్ల కలిగే మంట, ఇరిటేషన్ తగ్గడంతో పాటు, చర్మంపై ముడతలు రాకుండా యవ్వనంగా కనిపిస్తుంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గి, స్కిన్ టోన్ మెరుగుపడి, ట్యాన్ తగ్గి అందంగా, యవ్వనంగా కనిపించడానికి ఐస్ వాటర్ చక్కటి పరిష్కారం.
Latest News