|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 06:02 PM
భారత్ ఒలింపిక్స్-2036 క్రీడల నిర్వహణకు పూర్తిగా సిద్ధమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గత దశాబ్ద కాలంలో 20కి పైగా అంతర్జాతీయ క్రీడా పోటీలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిందని, 2030 కామన్వెల్త్ గేమ్స్ కూడా ఇక్కడే జరుగుతాయని చెప్పారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఆయన, క్రీడల్లో సమన్వయం, విశ్వాసం, జట్టు సంసిద్ధత విజయానికి కీలకమని అన్నారు. జనవరి 4 నుంచి 11 వరకు జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో వెయ్యి మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు.
Latest News