|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:24 PM
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో పూర్తి క్రెడిట్ జగన్ ది కాగా, నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ఆ క్రెడిట్‌చోరీకి పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు ఆక్షేపించారు. ఎయిర్‌పోర్టుకు భూసేకరణ మొదలు అనుమతులు, ఒప్పందాలు, ఆ తర్వాత పనుల్లోనూ ఎక్కువ శాతం నాడే పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టుపై నాడు ఎంతో చొరవ చూపిన జగన్‌గారు, అందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారని, విశాఖ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారని వెల్లడించారు. ఇప్పుడు ఆ రహదారి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న ఆయన, భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు సమాధానం చెప్పాలని కోరారు. ఆ మెయిన్ కనెక్టివిటీ రోడ్డుపై ఇప్పటివరకు డీపీఆర్ సిద్ధం కాలేదని, రోడ్ అలైన్‌మెంట్‌కూ ఇంకా ఆమోదం రాలేదని, అయినా పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని విశాఖలో మీడియాతో మాట్లాడిన కెకె రాజు దుయ్యబట్టారు.
Latest News