|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 03:20 PM
AP: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ ఆలయంలో వారాంతాలు, ముఖ్య పర్వదినాల్లో అంతరాలయ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో శీనానాయక్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అంతరాలయ దర్శనం ఉండదన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రద్దీ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ అధికారులను ఆదేశించారు.
Latest News