|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 06:24 PM
AP: పొదుపు సంఘాలు ఇకపై ఆన్‌లైన్‌లోనే రుణాలు పొందే సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు శివారులో జరిగిన సరస్ మేళాలో ఆయన మాట్లాడుతూ.. పొదుపు సంఘాల్లో 1.13 కోట్ల మంది సభ్యులు ఉండగా, రూ.26 వేల కోట్ల నిధి, రూ.5,200 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటయ్యిందన్నారు. మహిళా సంఘాల శక్తి తనకు తెలుసని, దేశంలోని ఉత్తమ విధానాలను రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు.
Latest News