|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 06:54 PM
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తత అవసరమని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడకుండా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూంలో డయల్ 100 పనితీరును ఆయన ఆరాతీశారు. అంతకుముందు పిఠాపురంలో గొల్లప్రోలు హౌసింగ్ వద్ద నిర్మించిన నూతన బ్రిడ్జిని కూడా ఆయన పరిశీలించారు.
Latest News