|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 11:39 AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. తంజావూరులో జరిగిన డీఎంకే మహిళా సదస్సులో మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్న ప్రధాని వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం తమిళనాడేనని, చెన్నై, కోయంబత్తూరు నగరాలు సేఫ్ సిటీల జాబితాలో ఉన్నాయని తెలిపారు. మణిపూర్, బిల్కిస్ బానో ఘటనలను ప్రస్తావిస్తూ మహిళల భద్రతపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ అడ్డుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు.
Latest News