జగన్ హయాంలో కట్టిన త్రాగునీటి ప్రాజెక్టుని కూడా కూటమి చేసినట్లు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు
 

by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:09 PM

అంతర్వేది దేవస్థానం పరిసర ప్రాంతాలు, పల్లిపాలెం, అంతర్వేది కర, గొంది, కేశవదాసుపాలెం గ్రామాలకు శాశ్వత త్రాగునీటి సదుపాయం కల్పించిన ఘనత పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదేనని రాజోలు నియోజకవర్గ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మాజీ మంత్రి వర్యులు గొల్లపల్లి సూర్యరావు స్పష్టం చేశారు. ఈ అంశంపై నియోజకవర్గ నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన సూర్యరావు మాట్లాడుతూ.. అప్పటి ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో రూ.18 కోట్ల నిధులు మంజూరు చేసి త్రాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి, పనులు పూర్తిచేయించారని గుర్తు చేశారు. అయితే వైయ‌స్ జగన్ ప్రభుత్వంలో ప్రారంభమై, పూర్తి అయిన ఈ ప్రాజెక్టును తమ ఘనతగా చెప్పుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు యత్నించడం క్రెడిట్ చోరీకి నిదర్శనమని సూర్యరావు ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను రాజకీయ లాభాల కోసం వాడుకోవడం అన్యాయమని విమర్శించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే అంతర్వేది ప్రాంత ప్రజలకు త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని, ఈ నిజాన్ని ప్రజలు మరువరని ఆయన స్పష్టం చేశారు. వైయ‌స్ జగన్ నాయకత్వంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి, ప్రతి ఇంటికి మౌలిక వసతులే లక్ష్యంగా పాలన సాగిందని తెలిపారు.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM