|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:13 PM
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ జగన్‌గారిపై బురద జల్లుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కుట్ర బట్టబయలైందని వైయస్ఆర్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతో విష ప్రచారం చేసి, కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బ తీసిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వెంటనే శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం దురుద్దేశంతోనే తిరుమల నెయ్యిపై విష ప్రచారం చేసి, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం, జగన్‌గారిపై నిందలు వేశారని చెప్పారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా డెయిరీ నిజానికి అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందని వెల్లడించారు. అయినా దాన్ని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి అంటగట్టి విష ప్రచారం చేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు.
Latest News