|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 08:24 PM
ఇంటి దగ్గర ఉండడం కంటే.. ఆ చిన్నారికి బడికి వెళ్లడమే ఇష్టం. స్నేహితులందరితో కలిసి ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చని.. అ ఆ ఇ ఈలు నేర్చుకోవచ్చని తెగ ముచ్చటపడేది. ప్రతిరోజూ ఉదయమే నిద్ర లేచి పాఠశాలకు ముస్తాబయ్యేది. ఆరోజు కూడా అలాగే ముస్తాబయ్యింది. బుడి బుడి అడుగులు వేస్తూ.. తన స్నేహితులతో కలిసి ఎంచక్కా పాఠశాలకు వెళ్లిపోయింది. తరగతి గదిలో కూర్చుని.. ఉపాధ్యాయుడు ఎప్పుడు వస్తాడా, ఈరోజు ఏం నేర్పిస్తాడా అని ఆలోచిస్తోంది. అప్పుడే వచ్చాడో ఉపాధ్యాయుడు. అందంగా కనిపిస్తున్న ఈ పసిబుగ్గల పాపాయిని పిలిచాడు. వెంటనే ఆ చిన్నారి పరిగెత్తుకుంటూ వెళ్లింది.
వెంటనే ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకున్నాడా టీచర్. అందరిలా ఆ చిన్నారిని ముద్దు చేశాడు. పైకి ఇలా ముద్దు చేస్తున్నట్లు కనిపించినా మనసులో మాత్రం మరో ఆలోచన ఉంది. ఎలాగైనా ఆ చిన్నారిని అనుభవించాలనుకున్నాడు. బడిలోనే.. అది కూడా అందరి కళ్లముందే ఆ చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. ఆపై ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోయాడు. కానీ ఇంటికెళ్లిన చిన్నారి.. తనపై ఉపాధ్యాయుడు చేసిన దారుణం గురించి తల్లిదండ్రులకు వివరించింది. ఇలా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం.. ఎక్కడ జరిగిందంటే..?
పోలీసుల కథనం ప్రకారం.. మధ్య ప్రదేశ్ తికాంగఢ్ జిల్లా పలేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ఆ చిన్నారి.. ప్రతిరోజూ లాగే గురువారం ఉదయం కూడా ఆనందంగా బడికి వెళ్లింది. అయితే ఎప్పటిలాగే తరగతి గదిలోకి వచ్చిన ఓ ఉపాధ్యాయుడు.. చిన్నారిపై కన్నేశాడు. బుజ్జి బుజ్జి మాటలతో, ఎవరూ చూసిన ముద్దు చేయాలనిపించే ఆ చిన్నారిపై.. మానవ మృగంలో మనసు పడ్డాడు. అందరి ముందే ఆ చిన్నారిని లొంగదీసుకుని బడిలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న ఆ పసిపాప జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. చిన్నారి చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు.. వెంటనే గ్రామస్థులతో కలిసి పాఠశాలకు చేరుకున్నారు.
ఈ ఘటనపై తికాంగఢ్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో మైనర్ బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన ధృవీకరించారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ మర్నాడే స్థానిక కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో అతడిని మళ్లీ జైలుకు తరలించినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని, పాఠశాలలోని ఇతర సిబ్బందిని కూడా విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులతో కలిసి కఠినమైన నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Latest News