|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:11 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపై జరిగిన హత్యాయత్నాన్ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ జిల్లా కేకే రాజు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆటవిక రాజ్యం నడుస్తోందని, అధికార మదంతో కూటమి నేతలు హద్దులు దాటుతున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు పై హత్యాయత్నానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులను చంపేందుకు కూడా వెనకాడని స్థాయికి కూటమి నేతలు దిగజారారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని కూటమి నేతలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే కూడా దారుణంగా మారాయని, ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా త్రోసిపుచ్చబడ్డాయని అన్నారు. కూటమి దాడులకు వైయస్సార్సీపీ భయపడేదే లేదని స్పష్టం చేసిన కేకే రాజు, ప్రజల పక్షాన పోరాటం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
Latest News