|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:12 PM
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు లేదని సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌తో అడ్డంగా బుక్కైన చంద్రబాబు నాయుడు.. తిరిగి ఇవాళ దొంగే దొంగా దొంగా అన్న తరహాలో దుష్ప్రచారం చేయడంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు, రిపోర్టు లేకుండానే లడ్డూ ప్రసాదం కల్తీ అయిందంటూ ఆరోపణలు చేయడం ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగిన చరిత్ర కూడా చంద్రబాబునాయుడుకే మిగిలిందని మండిపడ్డారు. ఎన్‌డీడీబీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కల్తీ లేదని చెప్పడంతో.. అడ్డంగా బుక్కైనా బుకాయించే ప్రయత్నం చేస్తూ.. కార్యకర్తల్లో విషాన్ని నింపుతున్న లోకేష్ తీరును తప్పుపట్టారు. వాస్తవాలు బట్టబయలైనా వితండవాదం చేస్తూ ఎల్లో మీడియా జాతీయస్ధాయి ల్యాబ్‌ల నివేదికలనూ తప్పు పడుతున్న వైనాన్ని ఖండించారు. లడ్డూ వ్యవహారంలో వైయస్.జగన్ ను ఇరికించడం బాబుకి చేతకాదన్నట్టు వార్తలు రాస్తున్న ఎల్లో మీడియా తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ఆలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని.. కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడం చంద్రబాబు పేటెంట్ అని, అధికారం కోసం ఎంతకైనా దిగజారడం బాబు నైజమని స్పష్టీకరించారు. మరోవైపు విశాఖలో చంద్రబాబు కుటుంబం చేస్తున్న భూదోపీడీ నిలదీసిన కన్నబాబు.. లోకేష్ తోడల్లుడు ఎంపీ భరత్ కు చెందిన గీతం సంస్థ రూ.5వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే.. దాన్ని అడ్డగోలుగా కట్టబెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సంపద సష్టి అంటే వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను తన కుటుంబానికి కట్టబెట్టడమా అని నిలదీశారు.
Latest News