|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:54 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసే ప్రతిపాదనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన వైఖరిని రాబోయే 24 గంటల్లో స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. లాహోర్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఉన్నతాధికారులతో పీసీబీ సుదీర్ఘంగా జరిపిన సమావేశం అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 15న జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితి ప్రపంచ క్రికెట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాంతో కలిసి పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఐదు గంటలకు పైగా చర్చలు జరిపారు. టోర్నమెంట్‌కే తలమానికమైన మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకోవడంతో సమస్యను త్వరగా పరిష్కరించాలని ఐసీసీ భావిస్తోంది. తుది నిర్ణయం తీసుకునే ముందు తమ దేశ ఫెడరల్ ప్రభుత్వాన్ని సంప్రదించాలని పీసీబీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈరోజు నఖ్వీ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉందని, త్వరలోనే స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు.
Latest News