మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
 

by Suryaa Desk | Mon, Feb 09, 2026, 07:52 PM

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ అధికారంలోకి రావడానికి, ప్రధాని నరేంద్ర మోడీ విజయానికి ఆర్ఎస్ఎస్ కృషియే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. రామాలయ నిర్మాణంలోనూ ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందని, స్వయంసేవకుల కఠోర శ్రమ వెనుక ఉందని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ పదవుల కోసం, క్రెడిట్ కోసం ఆరాటపడే సంస్థ కాదని, దేశం ఐక్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటుందని తెలిపారు.హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు 'భారతరత్న' ఇవ్వాలనే డిమాండ్‌పై భగవత్ స్పందించారు. అవార్డు కమిటీలో తాను లేనని చెబుతూ.. ఆ కమిటీలో ఉన్న వారిని కలిస్తే ఈ విషయం తప్పకుండా ప్రస్తావిస్తానని చెప్పారు. నిజానికి సావర్కర్ కు భారతరత్న ఇస్తే ఆ అవార్డుకే ఖ్యాతి పెరుగుతుందని చెప్పారు. ఎలాంటి పురస్కారాలు పొందకున్నా కూడా సావర్కర్ కోట్లాది భారతీయుల హృదయాల్లో చక్రవర్తిగా నిలిచారని భగవత్ కొనియాడారు.భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి 'మాస్ ప్రొడక్షన్' (భారీ ఉత్పత్తి) కంటే 'ప్రొడక్షన్ బై మాసెస్' (ప్రజల భాగస్వామ్యంతో ఉత్పత్తి) జరగాలని భగవత్ పిలుపునిచ్చారు. ఒకేచోట భారీగా ఉత్పత్తి చేయడం కంటే ఎక్కువ చోట్ల చిన్న తరహా ఉత్పత్తి జరిపితే వస్తువుల ధరలు తగ్గుతాయని చెప్పారు. అప్పుడు కంపెనీల మధ్య పోటీ ధరలపై కాకుండా వస్తువుల నాణ్యతపైకి మారుతుందని వివరించారు. నాణ్యత బాగుండేలా జాగ్రత్త పడితే మన వస్తువులకు విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతుందని తెలిపారు.

Latest News
US senators raise concerns over illegal online sale of abortion pills, flag India link Thu, Mar 26, 2026, 12:22 PM
Never opposed Ram Temple; donated for construction, says Digvijaya Singh in Ayodhya Thu, Mar 26, 2026, 12:20 PM
Kerala polls: Manalur revives legacy politics as veterans square off in high stakes contest Thu, Mar 26, 2026, 12:10 PM
India's commercial drone market to grow at 18 pc till FY29: Report Thu, Mar 26, 2026, 12:02 PM
Sensex, Nifty to remain closed on Ram Navami Thu, Mar 26, 2026, 11:49 AM