Tata Motors శోభనం: తమిళనాడులో రాణిపేటలో రూ.9,000 కోట్ల ప్లాంట్ ప్రారంభం
 

by Suryaa Desk | Mon, Feb 09, 2026, 08:56 PM

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) మరో పెద్ద అడుగు వేసింది. తమిళనాడులోని రాణిపేట జిల్లా పాణపక్కం వద్ద సరికొత్త, అత్యాధునిక తయారీ కేంద్రాన్ని సోమవారం అట్టహాసంగా ప్రారంభించింది.ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మరియు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పాల్గొని ప్లాంట్‌ను అధికారికంగా ప్రారంభించారు.రూ. 9,000 కోట్ల భారీ ప్రాజెక్ట్.ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ కోసం టాటా మోటార్స్ రూ. 9,000 కోట్ల పెట్టుబడిని చేయనుంది. రాబోయే 5–7 ఏళ్లలో, ఏడాదికి 2.5 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనుండనున్నాయి.ప్రత్యేకత ఏమిటంటే, ఈ ప్లాంట్‌లో టాటా వాహనాలతో పాటు, ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) కార్లను కూడా తయారు చేయనున్నారు. ప్లాంట్ ప్రారంభోత్సవ సందర్భంగా, ఇక్కడ తయారైన రేంజ్ రోవర్ ఎవోక్ ను సీఎం స్టాలిన్ స్వయంగా డ్రైవ్ చేసి ఆవిష్కరించారు.ఈ కేంద్రం భారతదేశంలో JLR కార్ల ఉత్పత్తికి అత్యంత కీలక కేంద్రంగా నిలవనుంది. ఇక్కడ తయారైన కార్లు దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లకు కూడా ఎగుమతి చేయనున్నారు. ప్లాంట్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనం (Renewable Energy) తో నడిచేలా రూపొందించబడింది. ఇది కేవలం వాహన తయారీ కేంద్రం కాకుండా, స్థిరమైన (Sustainable) తయారీకి ఒక నమూనా అని చంద్రశేఖరన్ తెలిపారు.సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ హబ్‌గా పేరు సంపాదించిందని, టాటా గ్రూప్ రాకతో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి మరింత ఊతం లభించినట్లు తెలిపారు. ఉద్యోగ అవకాశాలను కల్పించే ఇలాంటి భారీ పరిశ్రమలకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Latest News
Gujarat BJP leaders welcome Centre's move to cut fuel duty by Rs 10 per litre Fri, Mar 27, 2026, 02:11 PM
Mumbai hit-and-run: 76-year-old pedestrian seriously injured in Goregaon Fri, Mar 27, 2026, 02:09 PM
Key financial, regulatory changes to take effect from April 1 Fri, Mar 27, 2026, 02:07 PM
Norway, Belgium sign agreement on cross-border CO2 transport Fri, Mar 27, 2026, 02:00 PM
Pakistan resumes deportation of Afghan refugees through Torkham border Fri, Mar 27, 2026, 01:52 PM