|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 01:37 PM
గడిచిన 20 నెలలుగా పాలనను గాలికొదిలేసిన చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఆయన సాక్ష్యాధారాలతో తిప్పికొట్టారు. సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ నివేదిక ప్రకారం కూటమి ప్రభుత్వంలోనే కల్తీ నెయ్యి సరఫరా అయిందని... వాటితోనే లడ్డూలు తయారు చేశారన్న మల్లాది విష్టు... కల్తీ జరగడానికి బాధ్యుడు చంద్రబాబేనని తేల్చి చెప్పారు. మరోవైపు మంత్రి లోకేష్ సైతం ఎన్ డీ డీ బీ నివేదిక పేరుతో పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్న బోలే బాబాకు నెయ్యి సరఫరాకు 2018లో చంద్రబాబే అనుమతి లిచ్చారని ఆధారాలతో సహా వివరించారు. వైయస్.జగన్ హయాంలో కేజీ నెయ్యి రూ.320 కే ఏ రకంగా సాధ్యమంటున్న చంద్రబాబు... 2016 నుంచి 2018 మధ్యలో రూ.320 నుంచి రూ.271 కే ఎలా సఫ్లై చేశారని నిలదీశారు. కేవలం స్వార్ధ రాజకీయాల కోసమే శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రను తగ్గించేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు స్వామివారి ముందు తన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Latest News