|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 03:26 PM
అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ఐక్యతకు విఘాతం కలిగించేలా ఎవరూ ప్రవర్తించొద్దని ఆయన సూచించారు. ఎన్నికలకు ముందు నేతల్లో ఉన్న స్ఫూర్తిని కొనసాగించాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదేళ్ల పాటు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో మార్పు రాలేదని, రాష్ట్రంలో వైసీపీ కుట్రలు చేస్తోందని, వాటిని తిప్పికొట్టాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రం బాగు కోసమే దుర్గార్మపు పాలనను అంతమొందించామని, అప్పుడు ఎలా అయితే కలిసి పని చేశామో ఇప్పుడూ అలాగే కొనసాగాలన్నారు. మరో ఐదేళ్ల పాటు కూటమి నేతలు ఐక్యంగా పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో మార్పు రాలేదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ కుట్రలు చేస్తోందని, కూటమి నేతలంతా దీటుగా తిప్పికొట్టాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
Latest News