|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 10:17 AM
రష్యాలో వాట్సాప్‌ను పూర్తిగా బ్లాక్ చేసే దిశగా చర్యలు జరుగుతున్నాయని మెటా ఆరోపించింది. దేశంలోని ఇంటర్నెట్ వ్యవస్థల్లో వాట్సాప్ డొమైన్‌లను నిరోధించినట్లు తెలుస్తోందని పేర్కొంది. స్థానిక డిజిటల్ వేదికలపై నియంత్రణ పెంచేందుకు సొంత ‘మ్యాక్స్’ యాప్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విమర్శించింది. వినియోగదారులతో అనుసంధానం కొనసాగించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మెటా వెల్లడించింది. మరోవైపు రష్యా పౌరులను మ్యాక్స్ యాప్ వినియోగించాలంటూ అధికార వర్గాలు సూచిస్తున్నాయి.గ్లోబల్ టెక్ కంపెనీలన్నీ కూడా తమ దేశీయ చట్టాలను పాటించడంలో విఫలమయ్యాయని, సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేస్తోన్నాయని, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా అవాస్తవాలనూ ప్రచారం చేస్తోన్నాయని రష్యా చాలాకాలం నుంచి ఆరోపిస్తూ వస్తోంది. తమ దేశంలో వాట్సాప్ సేవలు తిరిగి పునరుద్ధరణకు నోచుకోవాలంటే మెటా.. స్థానిక చట్టాలకు లోబడి ఉండాలని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. మెటా రాజీ పడని వైఖరిని అవలంబిస్తే, వాట్సాప్ పునరుద్ధరణకు అవకాశం ఉండబోదని తేల్చి చెప్పారు.
Latest News