|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 11:59 AM
రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ చేసిన ప్రసంగం పై వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, రాయలసీమ ప్రజలకు జరిగే అన్యాయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇసాక్ బాషా మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ అమలు అయ్యిందని పేర్కొన్నారు. అయితే, సూపర్ సిక్స్ ఎక్కడ, ఎలా అమలు అయ్యిందో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను ప్రశ్నిస్తే ప్రభుత్వం దాడులు చేస్తోందని, హత్యాయత్నం చేసిన వారికే స్టేషన్ బెయిల్ ఇచ్చి బాధితులను రిమాండ్‌లో ఉంచడం దుర్మార్గ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాయలసీమకు అన్యాయం జరుగుతున్నదని, తదుపరి బడ్జెట్ ఎంత నిస్సారంగా ఉంటుందో ఇప్పటికే అర్థమైపోయిందని పేర్కొన్నారు.
Latest News