టీ20 ప్రపంచ కప్‌లో తొలి సంచలనం.. ఆసీస్‌పై జింబాబ్వే విజయం
 

by Suryaa Desk | Fri, Feb 13, 2026, 06:21 PM

టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే జట్టు 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, రెన్షా (65), మాక్స్ వెల్ (31) మినహా మిగిలిన బ్యాటర్స్ విఫలమవడంతో 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. జింబాబ్వే బౌలర్లు బ్లెస్సింగ్ ముజార్బాని (4 వికెట్లు), బ్రాడ్ ఎవాన్స్ (3 వికెట్లు) కీలక పాత్ర పోషించారు.జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ 56 బంతుల్లో 64 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. ఇది టీ20 ప్రపంచ కప్‌లో అతని తొలి హాఫ్ సెంచరీ. తడివానాషే మరుమాణి, ర్యాన్ బర్ల్ కూడా తలా 35 రన్స్ చేశారు. చివర్లో కెప్టెన్ సికందర్ రజా 13 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ లో మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్ చెరో వికెట్ తీసుకున్నారు.

Latest News
India, Japan commit to stronger healthcare systems, resilient supply chains Tue, May 05, 2026, 03:21 PM
'Tamil Nadu, Kerala results show strength of Indian democracy' Tue, May 05, 2026, 03:06 PM
India among countries with comprehensive national framework for rare diseases: Govt Tue, May 05, 2026, 03:05 PM
Japan's child population hits new low, down for 45th straight year Tue, May 05, 2026, 02:51 PM
Six arrested in Bengaluru drug bust; MDMA, Hydro Ganja worth Rs 20 crore seized Tue, May 05, 2026, 02:50 PM