|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 11:20 AM
ఏపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. భూముల సమస్యలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అమరావతి సచివాలయంలో సమావేశమై, రాష్ట్రవ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల్లో 7.85 లక్షల ఎకరాలకు విముక్తి కల్పించాలని నిర్ణయించింది. మిగిలిన 5.74 లక్షల ఎకరాలపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది రైతులకు ఊరట లభించింది. ఈ భూముల రిజిస్ట్రేషన్లకు నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వాలని, ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు
Latest News