|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 11:51 AM
రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లపై శుభవార్త తెలిపింది. మార్చిలో 8,977 స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనుంది. మార్చి 1న ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28నే పెన్షన్లు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 62.76 లక్షల మందికి రూ.2,725 కోట్లు పంపిణీ చేయనుంది. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నారు. మార్చి 28న పింఛన్ల పంపిణీ నేపథ్యంలో ఆ రోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
Latest News