|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 07:01 PM
గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో కొంతమంది యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అక్కడ నివసించే ఓ మహిళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే ఎమ్మెల్యే ద్విచక్ర వాహనంపై స్వయంగా అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రాకను గమనించిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం స్థానిక ప్రజలు, ఫిర్యాదు చేసిన మహిళతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలని పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు
Latest News