|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 02:55 PM
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పాలకులు తమ సైనిక చర్యలను సీరియస్‌గా తీసుకోవాలని హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "చెత్త పాలకుల చేతుల్లో అణ్వాయుధాలు ఉండటం ప్రపంచానికే ప్రమాదం" అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చర్చలకు పిలుపును బలహీనతగా భావించవద్దని, సైనిక చర్యల హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. సైనిక చర్యకు సంబంధించి తాము చేసే హెచ్చరికలను ఇరాన్ చాలా సీరియస్‌గా తీసుకోవాలని హెచ్చరించారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నారని.. కానీ ఆయన వద్ద సైనిక పరమైన మరిన్ని ఎంపికలు సిద్ధంగా ఉన్నాయని వాన్స్ గుర్తు చేశారు. ఆ ఎంపికలను ప్రయోగించడానికి ట్రంప్ సుముఖంగా లేరని.. అయితే పరిస్థితి చేయి దాటితే ఏ చర్యకైనా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
Latest News