|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 03:34 PM
AP: తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులో 30వ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో తమిళనాడులోని అరక్కోణం తాలూకాకు చెందిన నటరాజన్ అనే భక్తుడు మృతి చెందగా, మునిరత్నం అనే మరో భక్తుడు తీవ్ర గాయాలతో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా అతి వేగంగా వెళ్తున్న బైక్ రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News