|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:53 PM
తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చ జరిగితే వాస్తవాలన్నీ బయటకొస్తాయని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి తెలిపారు. అయన మాట్లాడుతూ... సీబీఐ సిట్ చార్జిషీట్ తర్వాత రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు తిరుమల శ్రీవారిని రాజకీయాల్లోకి లాగాడని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి టీటీడీ నిధులు దోచిపెట్టిన విధానంపైనే ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక చంద్రబాబు కుల మతాల పేరుతో రాజకీయాలు మొదలుపెట్టాడు. స్టేట్‌మెంట్ ఇస్తామంటూ మసిపూసి మారేడుగాయ చేయాలని చూస్తున్నారు. ఆలయాలను ప్రక్షాళన చేస్తున్నామంటూ అరాచకాలు సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నెయ్యి శాంపిల్స్ తీసి టెస్టులు చేస్తే, అందులో కల్తీ జరిగిందని వైయస్ఆర్‌సీపీ మీద నెపం నెడుతున్నారు అని మండిపడ్డారు.
Latest News