|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:39 PM
మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి పంకజ ముండేకు వింత అనుభవం ఎదురైంది. శాఖాపరమైన అంశాలపై చంద్రపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఐఏఎస్ అధికారి, ఎంపీసీబీ మెంబర్ సెక్రెటరీ ఎం.దేవేందర్ సింగ్ గైర్హాజరయ్యారు. కీలక సమావేశం అనీ, తప్పకుండా హాజరుకావాలని మంత్రి రిమైండర్ పంపినప్పటికీ ఖాతరు చేయలేదు. తాను రావడంలేదని మంత్రికి మెసేజ్ పంపించారు. ఈ విషయాన్ని మంత్రి పంకజ ముండే అసెంబ్లీలో ప్రస్తావిస్తూ.. ఐఏఎస్ అధికారి నిర్లక్ష్యంపై మండిపడ్డారు.దీంతో ప్రొటెం స్పీకర్ దిలీప్ లాండే సీరియస్ గా స్పందించారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై 24 గంటల్లోనే స్పందించిన ప్రభుత్వం.. ఎం.దేవేందర్ సింగ్ తో పాటు ఎంపీసీబీ జాయింట్ డైరెక్టర్ సతీష్ పద్వాల్ ను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కాలంలో దేవేందర్ సింగ్ ముంబై విడిచి వెళ్లకూడదని, అనుమతి లేకుండా ఎలాంటి ఇతర పనులు చేయకూడదని ప్రభుత్వం షరతులు విధించింది.
Latest News