|
|
by Suryaa Desk | Mon, Mar 30, 2026, 11:30 AM
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని ఎల్‌వీనగర్ ప్రాంతంలో ఉంటున్న నేవీ ఉద్యోగి రవీంద్రకు పెళ్ళై భార్య ఉండగా మౌనిక (28) అనే వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల మౌనిక డబ్బుల కోసం వేదిస్తుండటంతో భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో తన ప్రియురాలు మౌనిక(28)ను ఇంటికి పిలిచిన రవీంద్ర. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా, కత్తితో మౌనికను చంపి, ముక్కలుగా కోసి సగ భాగాన్ని ఫ్రిడ్జిలో ఉంచి, మరో సగ భాగం మూట కట్టి ఇంట్లో మూలకు ఉంచి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన రవీంద్ర. డబ్బుల కోసం వేధిస్తుండటంతోనే హత్య చేశానని పోలీసులకు రవీంద్ర వాగ్మూలం. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అయితే మౌనిక తల మాత్రం మిస్ అయినట్లు సమాచారం
Latest News