|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 11:40 AM
స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు ముఖ్య గమనిక. ఈ వారం సెలవుల కారణంగా ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 19 మధ్య ట్రేడింగ్ కేవలం 4 రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14, మంగళవారం) సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) పూర్తిగా మూసిఉంటాయి. అలాగే వారాంతపు సెలవులైన ఏప్రిల్ 18 (శనివారం), ఏప్రిల్ 19 (ఆదివారం) మార్కెట్లు పనిచేయవు. అంబేడ్కర్ జయంతి నాడు ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ, F&O, ఫారెక్స్ మార్కెట్లలో క్రయవిక్రయాలు నిలిచిపోతాయి.
Latest News