|
|
by Suryaa Desk | Wed, Apr 15, 2026, 01:49 PM
విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో పార్టీ కమిటీల నిర్మాణంపై బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ పరిశీలకులు పేడాడ రమణికుమారి, అసంపూర్తిగా ఉన్న వార్డు కమిటీలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న సభ్యుల వివరాలను త్వరగా వెరిఫికేషన్ చేయాలని, అప్పుడే కేంద్ర కార్యాలయం నుంచి గుర్తింపు కార్డుల ముద్రణ జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Latest News