|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 10:58 AM
చెన్నై సూపర్‌కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోల్‌కతా నైట్ రరైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానెకు రూ.12 లక్షల జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందుకు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 రూల్‌ను ఉల్లంఘించినట్లు నిర్వాహకులు తేల్చారు. ఈ సీజన్‌లో ఇది తొలి తప్పు కావడంతో కేవలం కెప్టెన్‌పైనే చర్య తీసుకున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న కేకేఆర్ శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది.
Latest News