|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 11:25 AM
గంజాయిని షెడ్యూల్-3 డ్రగ్‌గా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. గతంలో హెరాయిన్, ఎల్ఎస్డీ వంటి ప్రాణాంతక మత్తుపదార్థాలతో సమానంగా పరిగణించేవారు. ఈ మార్పుతో గంజాయి కోడైన్ కలిగిన టైలెనాల్ వంటి పెయిన్ కిల్లర్ల సరసన చేరుతుంది. దీర్ఘకాలిక నొప్పుల చికిత్సలో గంజాయి ప్రయోజనాలపై శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడమే దీని వెనుక ఉద్దేశమని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఫెడరల్ స్థాయిలో గంజాయికి వైద్యపరమైన విలువ ఉందని ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం ఇదే మొదటిసారి.
Latest News