|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 10:34 AM
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలో దారుణ ఘటన వెలుగుచూసింది. దుబాయ్ నుంచి షేక్ సుభానీ అనే వ్యక్తి ఓ వివాహితను వేధించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి సన్నిహిత ఫోటోలు, వీడియోలు ఉన్నాయని, వాటిని భర్తకు పంపిస్తానని, వాట్సాప్ గ్రూప్‌లో పెట్టి పరువు తీస్తానని బెదిరించి డబ్బు, బంగారం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడిని ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
Latest News