|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 11:04 AM
కూటమి ప్రభుత్వం కొబ్బరి కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, కేర సురక్ష బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కొబ్బరి చెట్లు ఎక్కేవారు, పీచు, నీరా తీసేవారు, కాయలు కోసేవారు, డొక్క తీసే కార్మికులు వంటి అర్హులు ప్రయోజనం పొందవచ్చు. మరణం లేదా శాశ్వత వైకల్యానికి రూ.7 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.3.5 లక్షలు, ఆసుపత్రి ఖర్చులకు రూ.2 లక్షలు, అంత్యక్రియలకు రూ.5,500, అంబులెన్స్ ఖర్చులకు రూ.3,500, తాత్కాలిక వైకల్యానికి రూ.21 వేలు, సహాయకుల ఖర్చులకు రూ.3,000 వరకు అందజేస్తారు. కార్మికులు కేవలం రూ.43 చెల్లించి రూ.7 లక్షల బీమా పొందవచ్చు, మిగిలిన మొత్తాన్ని కొబ్బరి అభివృద్ధి బోర్డు, ఏపీ లేబర్ వెల్ఫేర్ బోర్డు భరిస్తాయి.
Latest News