|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 09:16 PM
కోహినూర్ వజ్రం భారత్‌కు చెందాల్సిందేనని న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ పేర్కొన్నారు. ఈ విషయంపై తాను బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ IIIతో ప్రత్యేకంగా మాట్లాడి, సానుకూల నిర్ణయం వచ్చేలా ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.ప్రస్తుతం కింగ్ ఛార్లెస్ అమెరికాలో అధికార పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో వ్యక్తిగతంగా కోహినూర్ వజ్రం విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంటుందని మేయర్ వెల్లడించారు. భారతీయ మూలాలున్న మమ్దానీ, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ వజ్రం తిరిగి భారత్‌కు రావాలనే అంశంపై ఆసక్తి చూపుతున్నారు.కింగ్ ఛార్లెస్, క్వీన్ కెమిల్లా న్యూయార్క్ పర్యటనలో భాగంగా నగరంలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. 9/11 స్మారక స్థలిని కూడా దర్శించి, ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. అంతకుముందు రోజు, బ్రిటన్ రాజు అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. అనంతరం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ప్రధమ మహిళ మెలానియా ట్రంప్ వైట్ హౌస్‌లో రాజ దంపతులకు విందు ఇచ్చారు.
Latest News