|
|
by Suryaa Desk | Sat, May 02, 2026, 03:11 PM
సామాన్యులకు మరోసారి షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రవాణా ఖర్చుల పెరుగుదల ప్రభావంతో నెల రోజుల్లోనే నూనె ధరలు సుమారు 22 శాతం వరకు పెరిగినట్లు సమాచారం. సన్‌ఫ్లవర్ ఆయిల్ కిలో రూ.180 నుంచి రూ.200కు, పామాయిల్ రూ.120 నుంచి రూ.145కు, 5 కిలోల వేరుశనగ నూనె డబ్బా రూ. 1000 నుంచి రూ. 1150లకు, రైస్ బ్రౌన్ నూనె లీటర్‌కు రూ. 150 నుంచి రూ. 165కు పెరిగింది. ఇక సోయాబీన్, ఆవ నూనెల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.
Latest News