|
|
by Suryaa Desk | Sat, May 02, 2026, 03:16 PM
నెల్లూరు జిల్లాలో మే 27, 28, 29 తేదీల్లో మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మహానాడు స్థల పరిశీలన కోసం టీడీపీ బృందం నెల్లూరు, కోవూరులో పర్యటించింది. కోవూరులో 2, నెల్లూరులో మరో 2 స్థలాలను పరిశీలించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రెండు రోజుల్లో స్థలంపై స్పష్టత వస్తుందన్నారు.
Latest News