|
|
by Suryaa Desk | Sat, May 02, 2026, 03:17 PM
కమర్షియల్ ఎల్పీజీ ధరల పెరుగుదల ప్రభావం స్టార్ హోటళ్లపై తీవ్రంగా పడుతోంది. ఇటీవల కమర్షియల్ గ్యాస్ ధర ఏకంగా ₹993 పెరిగి ₹3,315కు చేరడంతో హోటల్ రంగం ఖర్చులు గణనీయంగా పెరిగాయి. దీంతో ఈ అదనపు భారాన్ని కస్టమర్లపై మోపాలని హోటల్ యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. ఆహార పదార్థాల ధరలను సుమారు 10% వరకు పెంచే అవకాశముందని సమాచారం. ఇప్పటికే ముడిసరకుల ధరలు పెరగడంతో నష్టాలు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు గ్యాస్ ధరల పెరుగుదలతో పరిస్థితి మరింత క్లిష్టమైందని హోటళ్ల సంఘాలు పేర్కొంటున్నాయి.
Latest News