తల్లాడ ఎంఈఓ ఎన్. దామోదరప్రసాద్, మల్సూర్ తండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అన్నపూర్ణపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పీఆర్డీయూ నాయకులు జిల్లా కలెక్టర్ గౌతమ్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. నాటి ఎంపీడీఓ ఆదేశాల మేరకే పాఠశాల ఆవరణలో గ్రామపంచాయతీ భవనం నిర్మించారని తెలిపారు. సస్పెన్షన్ ఎత్తివేతపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa