లోకేశ్వరం మండలం ఎడ్డూర్, పోట్పల్లి (బి) గ్రామాలకు చెందిన 100 మంది బీఆర్ఎస్ నాయకులు శనివారం ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పండరి, సాయన్న, లింగయ్య, సాయన్న, లస్మన్న, పోశన్న, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa