మునగాల మండల పరిధిలోని తిమ్మారెడ్డి గూడెం లో శనివారం విద్యుత్ స్తంభం కు ఆటో ఢీకొని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్తంభం విరిగి రోడ్డుపై పడిండి. విద్యుత్ ప్రసరిస్తున్న తీగలు రోడ్డు పై పడ్డాయి. ఆ సమయంలో ఎటువంటి రాకపోకలు లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. గుత్తేదారుల నుండి అధికారులు ముడుపులు తీసుకుని రోడ్డుపై ఉన్న స్తంభాలను తొలగించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa