పిట్లం మండలం చిన్నకొడప్గల్ కు చెందిన బోయిని కిష్టయ్య(40)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పిట్లం ఎస్ఐ నీరేష్ తెలిపారు. గ్రామ శివారులోని అటవీ భూమిలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో తలపై కొట్టి చంపినట్లు తెలిపారు. ఈ హత్య అతని భార్య చేయించినట్లు అనుమానంతో మృతుడి అన్న కొడుకు చంద్రశేఖర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa