అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పెనుబల్లి, పెంట్లం విద్యుత్ సబ్ స్టేషన్లలో మరమ్మత్తుల కారణంగా నామవరం, కంపగూడెం, భాస్కరాపురం, బుచ్చన్నగూడెం, పెంట్లం, నర్సాపురం, అన్నపురెడ్డిపల్లి, అన్నదైవం, తెలిజ, ఒడ్డుగూడెం గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa