మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్ రెడ్డి మూడు ఆవులు ఉదయం, 7: 00 గంటల ప్రాంతంలో మేతకు వెళ్లి కరెంట్ షాక్ కు గురై చనిపోయాయి. గ్రామ శివారులలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అటుగా వెళ్లిన మూడు ఆవులు విద్యుతాఘాతానికి గురయ్యాయి. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని, తమను ఆదుకోవాలని రైతు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa