బాన్సువాడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వింజమూరుకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును గురువారం డిపో మేనేజర్ సరితా దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూపర్ లగ్జరీ సర్వీస్ బాన్సువాడ నుండి ప్రారంభమై నిజామాబాద్, హైదరాబాద్, నాగార్జునసాగర్, వినుకొండ, కనిగిరి మీదుగా వింజమూరు చేరుకుంటుందని, ప్రయాణికులు బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa