జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు శ్రీనివాసులు బదిలీ నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు గురువారం మల్దకల్ ఎంఈవో సురేష్ కు వినతి పత్రం సమర్పించారు. శ్రీనివాసులు తమ గ్రామంలో పనిచేస్తూ అనేకమంది పిల్లలను బడికి వచ్చేలా కృషి చేశారని తెలిపారు. ఇలాంటి ఉపాధ్యాయుడు తాము వదులుకోబోమని తల్లితండ్రులు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa