ఆసుపత్రి కార్మికుల జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 15, 600 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో ఈ నెల 15వ తేదీ నుండి సమ్మెలోకి వెళ్తామంటూ శుక్రవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు నాయక్ కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు రామస్వామి, వెంకట్రాములు, కార్మిక నాయకులు రామేశ్వరమ్మ, వనజ, భద్రమ్మ, రాణి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa