తొగుట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన వి. రవికాంత్రావు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ ఆయనను అభినందించి శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, గంజాయి డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa