57వ డివిజన్ వడ్డెర కాలనీలో గత వంద సంవత్సరాల చరిత్ర కలిగి సత్యం కలిగిన తల్లి వడ్డెర కాలనీ ముత్యాలమ్మ,పురాతన గుడి స్థానంలో గత సంవత్సరం నూతన గుడి నిర్మించటం జరిగింది ఈ ఏడు శ్రావణమాసం రెండో ఆదివారం సందర్బంగా మొదటి సంవత్సరం బోనాల జాతర ఘనంగ జరిగాయి వందలాది మంది భక్తులు ఉదయం నుండే గుడికి వచ్చి అమ్మవారికి అభిషేకంచేయటం జరిగింది.
తర్వాత బోనాలు పెద్దఎత్తున ఆ ప్రాంత ఆడబిడ్డలు వారి ఇండ్లల్లో బోనాలు వండుకొని అంబరానంటే సంబరాలతో డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా బొనమెత్తుకొని ఆసత్యంగల్ల ముత్యాలమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా గుడి వ్యవస్థాపకులు ఖమ్మం నగర BRS అధ్యక్షులు 53 డివిజన్ కార్పొరేటర్ .శ్రీ పగడాల నాగరాజు శ్రీవిద్య గార్లు హాజరై బోనం ఎత్తి అమ్మవారికి మొక్కులు చెలించి ప్రత్యేక పూజలు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa